All about Sama Veda – Chapter 8 (సామవేదీయ సర్వస్వము – అష్టమార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

అష్టమార్చిక

 

చెప్ప మరచినది

క్రిందటి అర్చికలో చెప్ప మరచిన విషయమొకటున్నది. శౌనకమునీంద్రుడు వ్రాసిన ఋగ్వేదప్రాతిశాఖ్యము శాకలశాఖ సంబంధి.

సామవేద శాఖలు

సామవేదమునకు రెండు శాఖలున్నవి.

 1. జైమినీయ శాఖ
 2. కౌథుమ శాఖ


కౌథుమశాఖకు ప్రచారమెక్కువ. దక్షిణ భారతమున, ముఖ్యముగా తెనుగు దేశమున, సామవేదీయులందరును కౌథుమశాఖనే పఠింతురు.

సామ రకములు

 1. ఋగ్వేదసామ: ఋగ్వేద సంహితనుండి తీసికొని దానిని గానయుతము గావించిన సామ ఋగ్వేదసామ
 2. యజుస్సామ: యజుర్వేదమునందలి యజుస్సుని తెచ్చి సామ చేసిన సామ యజుస్సామ
 3. సామసామ: సామవేదమునందు సామగా ఆవిర్భవించిన సామలు, సామసామలు
 4. అథర్వసామలు: అథర్వవేద సంహిత నుండి తెచ్చి సామగానైన సామలు అథర్వసామలు

సామగానము పఠించు వేదపండితులను “సామగులు” అందురు. సామగులైన గురువులు, తండ్రులు, తమ శిష్యులకు, కుమారులకు, ఈ నాలుగు విధములైన సామలను పఠింపజేతురు.
సామసంహిత యందీ నాలుగు విధములైన సామలు, ఒక వేద సంహిత సామలన్నియును ఒకచోటగా నుండవు. అన్ని రకములైన సామలును, సామసంహితయందు వెదజల్లబడి యుండును.
అనగా సామసంహితయందు సామ క్రమము వేరుగానుండును. సామసంహిత ఎట్లు ఊహించెనో అటుల ఉండును.

అనగా ఋగ్వేదసంహిత సామలన్నియు ఒక చోట, కృష్ణయజుర్వేదసామలు తరువాత, ఆమీదట శుక్లయజుర్వేదసామలు, సామసామలు, చివరకు అథర్వ లేక అధ్వరవేద సామలుగా నుండదు.
దానివలన మనము సామసంహితలో ఎక్కడ ఏ సామ ఉన్నదో ప్రకరణమును బట్టి (referenceని బట్టి), తెలియజేయు యాగమును బట్టి, యజ్ఞమును బట్టి, నుతిసేయు దేవతనుబట్టి గ్రహింపవలెను.

తాండ్యమహా బ్రాహ్మణమునందు ఏ క్రతుపర్వయందు ఏ ఏ సామలు ఏవిధముగా నుతింపవలెనో చెప్పబడి ఉన్నది. కాని అచ్చట కూడా నిశ్చయముగా ఈ సామ అని ఉండదు.
ఉదాహరణకు “పిబా సోమమిన్ద్ర” అనిన సామయున్నది. తాండ్యమునందు యీ సామ మహాసత్రయాగమునందు “పిబా సోమమిన్ద్ర” అనిన సామమున్నదనుకొనుడు. “పిబా సోమమిన్ద్ర” అనిన శబ్దములు ఆదిగా అనేక సామలున్నవి. వాటిలో ఏది మహాసత్రయాగమున పఠింపవలెనో చెప్పబడలేదు. అది మనము కనుగొనవలసినదే.

సూక్తము: సూక్తమునందు 2-3 నుండి 17-18 సామలుగూడ ఉండవచ్చును.

దశతులు

దశతి యందు 2-3 నుండి 10 సామలవరకు విరాజమానమగుచున్నవి. సామవేద సంహిత ప్రథమ దశతి / పూర్వార్చికలోని ఆగ్నేయకాండమందలి ప్రథమ అధ్యాయము, ప్రథమ ప్రపాఠకము, ప్రథమార్ధ ప్రపాఠకమునందు పది సామలున్నవి.

అందు మొదటి సామ:

Samaveda-Telugu-AgnaAyahi

Samaveda-Devanagari-AgnaAyahi

ఈ సామయొక్క

 • ఛందస్సు: గాయత్రీ
 • ఋషి: భారద్వాజః
 • దేవతా: అగ్నిః
 • స్వరము: షడ్జమము

ఇందు చివరి సామ – పదియవది:

Samaveda-Telugu-AgneVivasvadaa

Samaveda-Devanagari-AgneVivasvadaa

ఈ సామయొక్క

 • ఛందస్సు: గాయత్రీ
 • ఋషి: వామదేవః
 • దేవతా: అగ్నిః
 • స్వరము: షడ్జమముసామసంహిత దశమోధ్యాయమునందు – షష్ఠ ప్రపాఠక ప్రథమార్ధ ప్రపాఠకమునందు మూడు సామలున్నవి. అందు మొదటిది

Samaveda-Telugu-UtvaaMadantu

Samaveda-Devanagari-UtvaaMadantu

మూడవది:

Samaveda-Telugu-Tvameesishe

Samaveda-Devanagari-Tvameesishe

సామసంహిత మరికొన్ని విభాగములు

సామవేద సంహిత అనేకవిధములుగా విభజింపబడినది గదా! అందు కొన్ని విభాగములను ఈ క్రింద పొందు పరచుచున్నాను.

 1. అధ్యాయము
 2. ప్రపాఠకము
 3. అర్ధప్రపాఠకము
 4. ఖండము
 5. అష్టకము
 6. దశతి – (ఇదివరకే చెప్పబడినది)
 7. పర్వము
 8. అర్చిక
 9. సూక్తము – అనగా సామ-మన్త్రము
 10. గ్రామే గేయగానము
 11. గ్రామే అరణ్యగానము

ప్రచురణ విభాగములు

ఈ అన్ని విభాగములును, అన్ని ప్రచురణలందును కనపడవు. కొన్ని విభాగములు కొన్ని ప్రచురణలందు కనపడుచున్నవి.

సామసంహిత ప్రధాన విభాగములు

 1. పూర్వార్చిక లేక ఛందార్చిక
 2. ఉత్తరార్చిక
 3. భారణ్డ సామ
 4. తవాశ్వీయము
 5. మహానామ్నార్చిక
 6. పరిశిష్టము

అర్చికావిభాగములు – తిరిగి చెప్పబడినది

సామసంహిత ప్రధానముగా రెండు విభాగములు గదా! అవి

  1. పూర్వార్చిక లేక ఛందార్చిక
  2. ఉత్తరార్చిక

అవి యిదివరకే చెప్పబడినది

దృష్టులు

ఈ అర్చికావిభాగములను రెండు విధములుగా చూడవచ్చును

 1. సామవేద దృష్టి
 2. ఋగ్వేద దృష్టి

సామవేద దృష్టి

సామవేద దృష్ట్యా ఛందార్చిక అనగా పూర్వార్చిక 6 ప్రపాఠకములు

  1. అగ్ని పర్వము – మొదటి అర్ధపర్వము, రెండవ అర్ధపర్వము
  2. ఐన్ద్ర పర్వము – మొదటి అర్ధపర్వము, రెండవ అర్ధపర్వము
  3. పావమాన పర్వము – మొదటి అర్ధపర్వము, రెండవ అర్ధపర్వము

మొత్తము – 6

ఋగ్వేద దృష్టి

ఋగ్వేద దృష్ట్యా

 1. ఆగ్నేయపర్వమ్
 2. ఐన్ద్రంపర్వమ్
 3. పావమానమ్ పర్వమ్
 4. ఆరణ్యం పర్వమ్
 5. మహానామ్నాః
 6. స్తోభ
 7. భారణ్డమ్
 8. తవశ్యావీయమ్

ఉత్తరార్చిక

ఉత్తరార్చికయందు

 1. గ్రామే ఊహగానము
 2. గ్రామే ఊహ్యగానము

గ్రామేగేయగానమునందు

 1. అగ్నిపర్వః
 2. ఐన్ద్రపర్వః
 3. పావమానంపర్వః
 4. ఆరణ్యంపర్వః
 5. మహానామ్నాః

అరణ్యగానము

అరణ్యగానమునందు

 1. అర్కపర్వః
 2. ద్వన్ద్వపర్వః
 3. వ్రతపర్వః

గానములు

గానములు అన్నియును సామలు. వీటినుండి గానములు ఉద్భవిల్లినవి. ఆ గానములు అన్నియు ఒక్కచోట లేవు. గ్రామేగేయగానమునందు, గ్రామేఅరణ్యగానమునందు, పావమానమునందును ఉన్నవి. వాటినన్నిటినీ, ఏరి ఒకచోట చేర్చి, గానగ్రన్థమును (భాష్యసహితముగా)‍ ప్రకటింపవలెను.

ఈ గానములందు స్తోభలుగూడ ఉన్నవి. స్తోభలయందు ప్రధానముగ అ, యి, ఉ లు, హా, హీ, హూ, హై, హౌ లు ఉండును. కొన్ని స్తోభగానములు పూర్తిగా పై అక్షరములతోడనే ఉండును.

మహానామ్నార్చిక – పంచపురీష పదాని

ఈ రెండును అనేక సామగాన గ్రన్థములందు పూర్వార్చిక, ఉత్తరార్చికలమధ్య ప్రకటింపబడెను. కాని శ్రీ సత్యవ్రత సామశ్రమీ భట్టాచార్యవరేణ్యుడు (వంగదేశమందలి సుప్రసిద్ధ పండితుడు) తన సామవేద సంహితయందు పూర్వార్చిక, ఉత్తరార్చికలు అయిన తరువాత ప్రకటించెను.

ఈ రెండువిధములైన ప్రకటనలందున్న ప్రయోజనాప్రయోజనములను వేరుగా విచారింపవలెను.

 

అష్టమార్చిక సంపూర్ణము

Advertisements
Leave a comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: