New Website: శ్రీ అక్షింతల సుబ్బరాయ శాస్త్రి గ్రంథ కదంబము | Sri Akshintala Subbaraya Sastry Manuscript Collection

We are happy to announce the website containing scanned copies of several manuscripts that are my family heirloom for over 250 years. Most of these manuscripts were collected by Sri Akshintala Subbaraya Sastry, who lived during the latter part of 1700’s.

Most of these manuscripts deal with the following subjects:

 • mīmāṃsa
 • tarka (nyāya)
 • navya-nyāya
 • vedānta

All these manuscripts are in Devanagari, & Telugu scripts with a small portion in Bengali script.

The manuscripts include the following texts:

 • అవయవం గదాధరి (avayavam – gadādharī | अवयवम् – गदाधरी)
 • గదాధరియ్యం సామాంన్య నివృత్తి మొదలుకొని బాధాంతం బాళబుదు పుస్తకం (gadādharīyam – samānya nivr̥tti till bādhā | गदाधरीयम् – समान्य निवृत्ति till बाधा)
 • గదాధరియ్యం పుస్తకాలు గౌడాక్షరాలు (gadādharīyam – Bengali script | गदाधरीयम् – वंग लिपि )
 • మౌక్తికవాదార్థం (mauktikavādārtham | मौक्तिकवादार्थम्)
 • ధర్మితావఛేదకవాదార్థం (dharmitāvacchedakavādārtham | धर्मितावच्छेदकवादार्थम्)
 • జగదీశియ్యం వ్యాప్తివాదం (jagadīśīyam – vyāptivādam | जगदीशीयम् – व्याप्तिवादम्)
 • దీధితి చింతామణి – యింని కలిగిన పుస్తకం (dīdhiti cintāmaṇī | दीधिति चिन्तामणी)
 • మీమాంసాకౌస్తుభం పుస్తకం (mīmāṁsākaustubham | मीमांसाकौस्तुभम् )
 • విశిష్ట వైశిష్ట్య వాదార్థం (viśiṣṭa vaiśiṣṭya vādārtham | विशिष्ट वैशिष्ट्य वादार्थम्)
 • నవ్యమత వాదార్థం (navyamata vādārtham | नव्यमत वादार्थम्)
 • శక్తివాదం కలిశిన పుస్తకం (śakti vādam | शक्ति वादम्)
 • గదాధరి పాతరాలు కేవలాన్వయి గ్రంథం పుస్తకం (gadādharī kevalānvayi | गदाधरी केवलान्वयि)
 • గదాధరి పక్షతా పాతరాలు పుస్తకం (gadādharī-pakṣatā | गदाधरी-पक्षता)
 • అద్వైతసిద్ధి బ్రహ్మానందీయం పుస్తకం (advaitasiddhi – brahmānandīyam | अद्वैतसिद्धि – ब्रह्मानन्दीयम्)
 • నిరుక్తిప్రకాశిక పుస్తకం (nirukti prakāśikā | निरुक्ति प्रकाशिका)
 • నఙివాదం, అకాంక్షావాదం గదాధరి విశిష్టవైశిష్ట్య వాదార్థం (naṅi vādam, ākāṅkṣāvādam, gadādhari – viśiṣṭa vaiśiṣṭya vādārtham | नङि वादम्, आकाङ्क्षावादम्, गदाधरि – विशिष्ट वैशिष्ट्य वादार्थम्)
 • అభిధావాదం (abhidhāvādam | अभिधावादम् )
 • బాధబుద్ధి వాదం (bādhabuddhi vādam | बाधबुद्धि वादम्)
 • వేదాంతప్రకరణం (vedāntaprakaraṇam | वेदान्तप्रकरणम् )
 • ఆఖ్యాతవాదార్థం (ākhyāta vādārtham | आख्यात वादार्थम्)
 • కావ్యప్రకాశిక వ్యాఖ్యానం (kāvyaprakāśika vyākhyānam | काव्यप्रकाशिक व्याख्यानम्)
 • గదాధరి పారామరుశ (gadādharī – pārāmaruśa | गदाधरी – पारामरुश )
 • సామాన్యనిరుక్తి మధుర (sāmānya nirukti – madhurā | सामान्य निरुक्ति – मधुरा)

 

All about Sama Veda – Chapter 12 (సామవేదీయ సర్వస్వము – ద్వాదశార్చిక

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

ద్వాదశార్చిక

ఋక్ ఋషి; సామ ఋషి

 • “యా ఋక్ తత్సామ” – ఛాం॥ ఉ॥ 1-3-4
 • “ఋచ్యధ్యూఢం సామ గీయతే” – ఛాం॥ ఉ॥ 1-6-1
 • “ఋచీషమ్” – ఋ॥ సం॥ 1-61-1, 6-46-4, 8-32-26, 6-2-6, 8-90-1, 8-92-9, 10-22-2
 • “ఋక్సామాభ్యామభిహితౌ గావౌ తే సామనావైతమ్” – అ॥వే॥సం 14-1-22
 • అమోహమస్మి సా త్వం సామాహమస్మ్యృక్త్వం ద్యౌరహం పృథివీత్వమ్। తా విహ సం భావవ జనయావహై – అ॥వే॥ 14-2-71

గానములు ఋగక్షకముల నుండియే గాక , స్తోభాక్షరముల నుండి గూడ ఉత్పన్నములైనవి.

స్తోభ పదముల నుండి ఉత్పన్నమైన సామలు – 32. ఇవి స్తౌభిక సామలు.

 • గ్రామేగేయమున – 1
 • అరణ్యగానమున – 26
 • ఊహగానమున – 5
  • మొత్తము – 32

ఒకే ఒక స్తోభాక్షరము నుండి ఉత్పన్నమైన సామ గూడ ఉన్నది

Read the full post »

All about Sama Veda – Chapter 11 (సామవేదీయ సర్వస్వము – ఏకాదశార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

ఏకాదశార్చిక

సామయోనులు – వికారము

 

సామకు మూలమైన ఋక్కు “సామయోని”. ఋక్కు సామకు మారుటకు “వికారము” అని పేరు. వికారములు రెండు రకములు:

1. అంతర్గత వికారము – ఋక్కు పొందు మార్పు.

ఉదాహరణము:

Read the full post »

All about Sama Veda – Chapter 10 (సామవేదీయ సర్వస్వము – దశమార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

దశమార్చిక

గేయగానఋక్కులు

సామవేదసంహిత ప్రధానముగ రెండు భాగములు – పూర్వార్చిక, ఉత్తరార్చిక అని. పూర్వార్చికకు ఇంకొక పేరు “ఛందార్చిక”.
సామవేదమునందున్న గానములు ఋక్కులనుండి, యజుస్సులనుండి, అధర్వములనుండి ఉద్భవించినదను విషయము, సామగానములను చూచినచో రూఢిగా తెలియును.
ఈ సామగానములకు “గేయగానములు” అని పేరు.
ఛందార్చిక పర్వలుగా విభజింపబడినది. అందు మొదటి నాలుగు పర్వలలో గానములైన ఋక్కుల వివరమిచ్చట ఈయబడినది.

Read the full post »

All about Sama Veda – Chapter 9 (సామవేదీయ సర్వస్వము – నవమార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

నవమార్చిక

సప్తస్వరాత్మికము

పూర్వార్చికయందు సామ ఋక్కులు ఒకటి తర్వాత ఒకటిగానుండును. కాని ఉత్తరార్చికయందు ఋక్కులు తృచముగా అనగా ప్రగాథ రూపమున ఉండును.

ప్రగాథమునందు ఋక్సామలు, ఋగ్వేదమునందువలెనే, త్రిస్వరాత్మికముగా ఉదాత్తానుదాత్తస్వరితముగా నుండును.

కాని సామలైన ఋక్కులు అట్లుకాదు. సప్తస్వరాత్మికములు.

సామవేద శాఖలైన జైమిని, కౌథుమ రెండు శాఖలందును, అర్చిక మరియు సంహితా భాగములు సప్తస్వరాత్మికముగనే ఉండును.

Read the full post »

All about Sama Veda – Chapter 8 (సామవేదీయ సర్వస్వము – అష్టమార్చిక)

– విశ్వనాథ అచ్యుతదేవరాయలు

అష్టమార్చిక

 

చెప్ప మరచినది

క్రిందటి అర్చికలో చెప్ప మరచిన విషయమొకటున్నది. శౌనకమునీంద్రుడు వ్రాసిన ఋగ్వేదప్రాతిశాఖ్యము శాకలశాఖ సంబంధి.

సామవేద శాఖలు

సామవేదమునకు రెండు శాఖలున్నవి.

 1. జైమినీయ శాఖ
 2. కౌథుమ శాఖ


కౌథుమశాఖకు ప్రచారమెక్కువ. దక్షిణ భారతమున, ముఖ్యముగా తెనుగు దేశమున, సామవేదీయులందరును కౌథుమశాఖనే పఠింతురు.

Read the full post »

All about Sama Veda – Chapter 7 (సామవేదీయ సర్వస్వము – సప్తమార్చిక)

సప్తమార్చిక

 

ప్రధానమైన ప్రశ్న

వేదములను గూర్చి, విచారించువేళ, ఒక ప్రధానమైన ప్రశ్న ఉద్భవించును. అసలీ వేదములు ఎందుకు ఉద్భవించినవని. మనకు తెలియని విషయము తెలియపరచుటకు.

 

తెలిసికొనుట ఎట్లు?

మనకు విషయము తెలియనిచో, తెలిసికొనుట ప్రయత్నము చేసి తెలుసుకొనెదము. Dictionaries, Encyclopedias – నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వములను చూచెదము. అందులో కూడ లేనిచో, పెద్దలకు గూడ తెలియనిచో, సృష్ట్యారంభమునుండి పుట్టిన ఏ మానవునికి తెలియనిచో, అపుడు ఏమి చేయవలయునో తెలియదు.

Read the full post »

All about Sama Veda – Chapter 6 (సామవేదీయ సర్వస్వము – షష్ఠమార్చిక)

షష్ఠమార్చిక

 

 1. ఐదు వేదముల విభాగములు

ప్రతివేదమును అవతరించినానంతరము, మన ప్రకరణార్థము (reference purposes) మన పూర్వులు విభాగములు చేసిరి. వేదము “ఆ సేతు శీతాచలము”‍ పఠించుటజేసి, ఏ ప్రాంతమువారు ఆ ప్రాంతమునకనువుగా విభజనము చేసుకొనిరి. ఆంధ్ర, ద్రవిడ (తమిళ) దేశములందు చేసిన విభజనను ఇతరప్రాంతములయందు తెలియదు. అటులనే ఇతర ప్రాంతములయందు చేసిన విభజనలు తెలుగుదేశమున తెలియదు.

ఇదిగాక ప్రతి వేదమునందును ఆ వేద విభజనము చెప్పబడినది. ఈ విభాగములు ఆసేతుహిమాచలము తెలిసినవి. ఇది అతి పురాతనమైన విభజనము.

 1. ఋగ్వేదము – పది మండములుగా విభజింపబడినది.
 2. కృష్ణయజుర్వేదము – ఏడు కాణ్డలుగా విభజింపబడినది.
 3. శుక్లయజుర్వేదము – 40 అధ్యాయములుగా విభజింపబడినది.
 4. అథర్వవేదము – 20 కాణ్డలుగా విభజింపబడినది.
 5. సామవేదము – 2 అర్చికలుగా విభజింపబడినది.

Read the full post »

All about Sama Veda – Chapter 5 (సామవేదీయ సర్వస్వము – పంచమార్చిక)

పంచమార్చిక

 

సత్యవ్రతశర్మణః

ఈయన నామధేయము సత్యవ్రతశర్మ. “భట్టాచార్యులు” సామవేదపండితలోకము సగౌరవముగా ఆయనపేరుతో పల్కెడు రీతి. అందరును ఆయనను వట్టి సత్యవ్రతశర్మ అనరు. గౌరవముగా, సత్యవ్రత భట్టాచార్యులు అందురు.

Read the full post »

All about Sama Veda – Chapter 4 (సామవేదీయ సర్వస్వము – చతుర్థార్చిక)

చతుర్థార్చిక

 

అర్చికా విభాగముల క్రమము

నేను యీ సామవేదపరిచయ గ్రన్థమును క్రిందటి అర్చికలో వ్రాసినట్లు సత్యవ్రత సామశ్రమి భట్టచార్యగారు ప్రకటించిన “సామవేద సంహిత”ను అనుసరించి, ఆయన ఏ క్రమములో అర్చికావిభాగములను వ్రాసెనో, నేనును అదియే విధముగా వ్రాసితిని.

సామవేదావిర్భవకాలమునుండి, అనేకమంది వేదజ్ఞులు, అర్చికాక్రమములను ఒకేవరుసలో శిష్యులకు చెప్పలేదు. వారివారి క్రమములో శిష్యవర్గము పఠించుటవలన, సామవేదముయొక్క సామార్చికాక్రమము ఒకే పద్ధతిగాలేక, బహుపద్ధతులై, బహు సంప్రదాయములైనది. ఏ సంప్రదాయమువారు వారి సంప్రదాయమే శ్రేష్ఠమనుచుండిరి. కాని, అన్ని సంప్రదాయములందును, ఒక్కటిగూడ లోపించకుండ, అన్ని అర్చికలు, అన్ని సామలు ఉన్నవి.

Read the full post »

%d bloggers like this: